ములుగు : అక్కా, చెల్లెళ్ల మద్య ఆస్తి తగాదాల విషయంలో బాధితురాలి నుంచి లంచం ( Bribe) తీసుకున్న ఎస్సై, కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులు ( ACB Raid ) రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని ములుగు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సీహెచ్ విజయ్‌కుమార్ ( SI Vijaykumar) , అతడి డ్రైవర్, కానిస్టేబుల్ రాజు ( Raju) మంగళవారం రాత్రి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇంటి నుంచి అక్కను ఖాళీ చేయించాలని చెల్లెలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు లంచం డిమాండ్ చేసి పట్టుబడ్డారు. ఇద్దరిని హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి , దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వంలోని ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు గాని, వాట్సప్ నంబర్ 9440446106 అనే నంబర్ ద్వారాగా , తెలంగాణ ఏసీబీ ఫేస్బుక్, ట్విటర్ ద్వారా గాని ఫిర్యాదు చేయాలని సూచించారు.