హైదరాబాద్, మార్చి 25: ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) హైదరాబాద్ చాప్టర్ నూతన చైర్‌పర్సన్‌గా శుభ్రా మహేశ్వరి నియమితులయ్యారు. ఉమా చిగురుపాటి స్థానంలో ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎర్నెస్ట్ అండ్ యంగ్‌లో చార్టెర్డ్ అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్న మహేశ్వరికి ఆర్థిక రంగంలో 20 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నది. కార్యదర్శిగా గుంజన్ సింధి, ట్రెజరీగా నిశితా మన్నే, జాయింట్ సెక్రటరీగా శిల్పా రాజు, జాయింట్ ట్రెజరీగా మాయ పటేల్ ఎంపికయ్యారు. ఈ నూతన కార్యవర్గం 2022-23 ఆర్థిక సంవత్సరం పనిచేయనున్నది. బ్లూస్టోన్స్ గ్రూపు ఆఫ్ కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న శుభ్రా..తిరుమల తిరుపతి దేవస్థానం, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్, నేషనల్ హైవేస్లతోపాటు 300కి పైగా కార్పొరేట్ సంస్థలకు సేవలు అందిస్తున్నారు.