న్యూఢిల్లీ: సివిల్స్ పరీక్షల్లో అమ్మాయిలు అదరగొట్టారు. టాప్ మూడు ర్యాంక్‌లను మహిళలే చేజిక్కించుకున్నారు. సివిల్ సర్వీసెస్ 2021 ఫలితాలను ఇవాళ రిలీజ్ చేశారు. శ్రుతి శర్మ టాప్ ర్యాంక్ సాధించింది. సివిల్స్‌లో 685 మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు యూపీఎస్సీ వెల్లడించింది. శ్రుతి శర్మకు ఫస్ట్ ర్యాంక్ రాగా, అంకితా అగర్వాల్, గామిని సింగ్లాలకు రెండవ, మూడవ ర్యాంక్‌లు వచ్చాయి.
సత్తాచాటిన తెలుగోళ్లు.. యశ్వంత్‌కు 15వ ర్యాంక్..
సివిల్స్ ఫలితాల్లో మన తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. యశ్వంత్ కుమార్ రెడ్డి 15 వ ర్యాంకు సాధించగా పూసపాటి సాహిత్య 24వ ర్యాంక్, కొప్పిశెట్టి కిరణ్మయి 56, శ్రీపూజ 62, గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి 69, ఆకునూరి నరేశ్ 117, అరుగుల స్నేహ 136, బి చైతన్య రెడ్డి 161, ఎస్ కమలేశ్వర్ రావు 297, విద్యామరి శ్రీధర్ 336, దిబ్బడ అశోక్ 350, గూగులావత్ శరత్ నాయక్ 374, నల్లమోతు బాలకృష్ణ 420, ఉప్పులూరి చైతన్య 470, మన్యాల అనిరుధ్ 564, బిడ్డి అఖిల్ 566, రంజిత్ కుమార్ 574, పాండు విల్సన్ 602, బాణావాత్ అరవింద్ 623, బచ్చు స్మరణ్‌రాజ్ 676వ ర్యాంకు సాధించారు.
సివిల్స్ 2021 ర్యాంకర్ల జాబితా..