ముంబై: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కొత్త ఎస్‌యూవీని కొన్నాడు. రూ.2.55 కోట్ల ఖరీదైన మెర్సీడీజ్ ఏఎంజీ జీ63 ఎస్‌యూవీని అయ్యర్ కొనుగలు చేశాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో కేకేఆర్ కెప్టెన్‌గా అయ్యర్ ఆడిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆ టోర్నీలో అతను పెద్దగా రాణించలేదు. కానీ ఈ సీజన్ వేలంలో అతను 12.25 కోట్లకు అమ్ముడుపోయాడు.అయితే మెర్సిడీజ్ ఏఎంజీ జీ63 ఎస్‌యూవీని అయ్యర్ ఇటీవలే ముంబైలో ఖరీదు చేసినట్లు తెలుస్తోంది. ఆ కారుతో అయ్యర్ దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మెర్సిడీజ్ ఏఎంజీ జీ63 భారీ సైజ్‌లో ఉంది. పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోతుంది. ఆ ఎస్‌యూవీకి 4.0 లీటర్ల వీ8 ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ ఉంది. అది దాదాపు రెండు టన్నుల బరువు ఉంటుంది. కేవలం 4.5 సెకన్లలో ఈ ఎస్యూవీ వంద కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. దీని అత్యధిక వేగం గంటకు 240 కిలోమీటర్లు.ఇప్పటికే అయ్యర్ వద్ద లాంబోర్గిని హురాకన్ ఈవో, ఆడి ఎస్5 కార్లు కూడా ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్‌కు అయ్యర్ ఎంపికయ్యాడు.