2020 మార్చి నుంచి ప్రపంచం ఎన్నో విధాలుగా మారిపోయింది. కొవిడ్ మహమ్మారి మనకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛను నిరాకరించింది. ఇంకా పని, చదువు, ప్రయాణాలు, ఇతర సామాజిక కార్యకలాపాలపై కఠిన పరిమితులకు కారణమైంది. ఇది మన రోజువారీ జీవితాల్లో సాంకేతికత కీలకపాత్ర పోషించే మిథ్యా ప్రపంచానికి అంకురారోపణ చేసింది. అలా మనం జీవితంలో ఆనందం కోసం కొత్త సూత్రాలను ఆకళింపు చేసుకున్నాం. కొత్త మార్గాలను వెతుక్కున్నాం. మనం ఇష్టారాజ్యంగా వాడుకునే స్వేచ్ఛను చాలా గౌరవించాలన్న దృక్పథాన్ని కొవిడ్ మహమ్మారి నాకు నేర్పించింది. అమెరికాలో నాకు మనుమడు జన్మించడం సహా, దీని కారణంగా నేను కుటుంబపరమైన ఎన్నో వేడుకలను కోల్పోవాల్సి వచ్చింది. అయితే నాకు సంతోషం కలిగించే విషయాలు ఏవైనా ఉన్నాయా? అంటే, అవి… ఏడాది వయసున్న నా మనుమడిని క్రమం తప్పకుండా వీడియోలో చూడటం. కార్యాలయంలో సిబ్బంది అంతా ఒక్కదగ్గరికి చేరకూడని నిబంధనల మధ్య, పనికి సంబంధించిన విజయాలను వర్చువల్గా జరుపుకోవడం.
– కిరణ్ మజుందార్ షా, చైర్పర్సన్, బయోకాన్ లిమిటెడ్