హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ ): వ్యవసాయ భూముల్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్లు నెలకొల్పే పీఎం – కుసుమ్ పథకంలో తెలంగాణ వారికి 30శాతం ప్రాధాన్యత ఇవ్వాలని, ఒక యూనిట్ సోలార్ ఎనర్జీ ధర రూ.4.28కు పెంచాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసొసియేషన్ (టీఎస్ఈఏ) కోరింది. ఈ మేరకు అసొసియేషన్ అధ్యక్షుడు బుర్ర అశోక్‌కుమార్ నేతృత్వంలోని ప్రతినిధులు సోమవారం ఇంధనశాఖ కార్యదర్శి సునీల్‌శర్మను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. సోలార్ ఉపకరణాల ధరలు భారీగా పెరగటంతో ప్రస్తుత ధరతో ప్లాంట్లు నడపలేమని, యూనిట్ ధరను పెంచాలని విన్నవించారు.