దారుణం | ఓ వీధికి చెందిన వారికి వస్తువులు అమ్మేందుకు నిరాకరణ : దుకాణాదారు అరెస్ట్
ఓ వీధికి చెందిన వారికి వస్తువులను అమ్మేందుకు నిరాకరించిన కిరాణా దుకాణం యజమానిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని టెన్కాసిలో వెలుగుచూసింది.
చెన్నై : ఓ వీధికి చెందిన వారికి వస్తువులను అమ్మేందుకు నిరాకరించిన కిరాణా దుకాణం యజమానిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని టెన్కాసిలో వెలుగుచూసింది. గ్రామ పెద్దల నిర్ణయంతోనే తానిలా చేశానని దుకాణం నిర్వాహకుడు చెబుతున్నారు. అరెస్టయిన దుకాణాదారును మహేశ్వరన్గా గుర్తించారు.
కొందరు విద్యార్ధులు దుకాణంలో స్నాక్స్ కోసం వెళ్లగా మీ వీధికి చెందిన వారికి వస్తువులను ఇవ్వవద్దని గ్రామ పెద్దలు నిర్ణయించారని, ఈ విషయం ఇంటికి వెళ్లి మీ కుటుంబ సభ్యులకూ చెప్పండని నిందితుడు కోరాడు.
ఈ అంశానికి సంబంధించి వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన జిల్లా అధికారులు ఎప్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ షాపును అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన గ్రామ పెద్దను కూడా అరెస్ట్ చేశారని జిల్లా అధికారులు తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

