Beauticians | దీర్ఘకాలంగా బ్యూటీషియన్లుగా పనిచేస్తున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడినట్టే.. తాజా అధ్యయనం ఏం చెబుతోందంటే..!
Beauticians | బ్యూటీ ఇండస్ట్రీ (beauty industry)లో ఎక్కువ కాలం పనిచేస్తున్నారా..? అయితే మీరు చాలా పెద్ద ప్రమాదంలో పడినట్టే. అవును.. దీర్ఘకాలంగా హెయిర్ డ్రెస్సర్లు (Hair Dressers), బ్యూటీషియన్లు (Beauticians)గా పనిచేసే మహిళలు ఊహించని ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది.
Beauticians | బ్యూటీ ఇండస్ట్రీ (beauty industry)లో ఎక్కువ కాలం పనిచేస్తున్నారా..? అయితే మీరు చాలా పెద్ద ప్రమాదంలో పడినట్టే. అవును.. దీర్ఘకాలంగా హెయిర్ డ్రెస్సర్లు (Hair Dressers), బ్యూటీషియన్లు (Beauticians)గా పనిచేసే మహిళలు ఊహించని ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. అందరినీ అందంగా తీర్చిదిద్దే బ్యూటీషియన్లు వారికి తెలియకుండానే అండాశయ క్యాన్సర్ (Ovarian Cancer) బారిన పడుతున్నట్లు కెనడాలోని మాంట్రియల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనంలో తేలింది. సేల్స్, రిటైల్, వస్త్ర తయారీ, నిర్మాణ రంగ పరిశ్రమల్లో పనిచేసేవారికి కూడా ఎంతో కొంత ముప్పు ఉందని వెల్లడైంది.
అందాన్ని మెరుగుపరిచేందుకు వాడే కొన్ని పదార్థాల వల్ల మహిళలు ఈ తరహా క్యాన్సర్ బారిన పడుతున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 29 రకాల రసాయనాల తాకిడికి గురికావడానికి అండాశయ క్యాన్సర్ ముప్పునకు మధ్య ఉన్న సంబంధాన్ని ఈ పరిశోధనలో విశ్లేషించారు. 18-79 ఏళ్ల వయసు మధ్య ఉన్న మొత్తం 1,388 మంది మహిళలపై అధ్యయం చేశారు. అందులో 491 మందికి అండాశయ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. 10 ఏళ్లకు పైగా హెయిర్ డ్రెస్సర్లు, బ్యూటీషియన్లుగా పనిచేసిన మహిళలకు అండాశయ క్యాన్సర్ ముప్పు మూడు రెట్లు ఎక్కువ అని అధ్యయం చెబుతోంది. 13 రకాల రసాయనాలు ఈ ముప్పును మరింత చేరువ చేస్తున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
బ్యూటీషియన్లు, కేశాలంకరణ చేసేవారు మాత్రమే కాదు, వస్త్ర పరిశ్రమలో దీర్ఘకాలికంగా పనిచేసే వారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం 85 శాతం ఎక్కువగా ఉందని అధ్యయనం తెలిపింది. సేల్స్ రంగంలోని వారికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం 45 శాతం అని, రిటైల్ రంగంలోని వారికి ఈ ముప్పు 59 శాతం ఉందని పేర్కొంది. టాల్కమ్ పౌడర్, అమ్మోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్, హెయిర్ డస్ట్, సింథటిక్ ఫైబర్స్, డైస్, కలర్స్, సెల్యులోజ్, ఫార్మాల్డిహైడ్, ప్రొపెల్లెంట్ గ్యాస్, బ్లీచ్ లలో ఉండే రసాయనాల వల్ల 8 ఏళ్లకు పైగా ఈ రంగంలో పనిచేస్తున్న మహిళలకు అండాశయ క్యాన్సర్ ముప్పు 40 శాతం ఎక్కువ అని తాజా అధ్యయనం తెలిపింది.
Also Read..
Sudha Murty | స్టార్ నటి కారణంగా ఏడ్చేసిన సుధామూర్తి..!
Samantha | వెకేషన్లో సామ్.. కొత్త లుక్‌లో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తూ..
IndiGo | యుద్ధ వీరుడికి ఇండిగో అపూర్వ సత్కారం.. వీడియో వైరల్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

