అమరావతి : ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) కూటమి పార్టీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీ(TDP) , బీజేపీ (BJP) కి చెందిన కీలక నాయకులు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ( YS Jagan ) సమక్షంలో వైసీపీ ( YCP ) లో చేరారు. కర్నూల్ జిల్లా టీడీపీకి చెందిన మధు, మల్లికార్జున్, బీజేపీకి చెందిన మురహరిరెడ్డి, కిరణ్కుమార్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పీజీ రాంపుల్లయ్య యాదవ్, టీడీపీ కార్పొరేటర్ మోనికారెడ్డి, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ నరసింహులు యాదవ్కు పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
డీసీసీబీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ లోక్నాథ్ యాదవ్, మాజీ రైల్వే బోర్డ్ మెంబర్ ప్రదీప్ వెంకటేశ్ యాదవ్, టీడీపీ నాయకులు షబ్బీర్ అహ్మద్, ఫైరోజ్ తదితరులు వైసీపీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, కర్నూలు సిటీ వైసీపీ అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.