బండ్లగూడ, జనవరి 20 : మన ఊరు-మన బడి పైలట్ ప్రాజెక్టుకు రాజేంద్రనగర్ మండల పరిధిలోని శివరాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంపిక అయింది. ఈ పాఠశాల అభివృద్ధికి ఇప్పటికే రూ. 93 లక్షలు మంజూరు చేశారు. ఆరు నుంచి పదోతరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో 1200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తుండటంతో అడ్మిషన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. పాఠశాలలో మరమ్మతు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పాఠశాల ప్రహారిని అందంగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థుల కోసం అధునాతన టాయిలెట్లను నిర్మిస్తున్నారు. భవనానికి రంగులు వేస్తుండడంతో సరికొత్త శోభను సంతరించుకుంటుంది.
విద్యార్థుల సంఖ్య పెరగుతుంది
మన ఊరు-మన బడి పథకం ద్వారా పాఠశాలను అభివృద్ధి చేయడం ఆనందంగా ఉంది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దడంతో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పాఠశాలలో మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తుండడంతో పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. – ప్రధానోపాధ్యాయులు కిషన్‌నాయక్