ముంబై : ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చే బాలీవుడ్ భామల్లో పొడుగుకాళ్ల బ్యూటీ శిల్పా శెట్టి ముందువరసలో ఉంటారు. ఎలాంటి పరిస్ధితిలోనైనా వర్కవుట్లను విడిచిపెట్టరామె. కాలు విరిగినా సడలని సంకల్పంతో జిమ్‌లో కసరత్తులు చేస్తున్న న్యూ వర్కవుట్ వీడియోను శిల్పా శెట్టి పోస్ట్ చేసింది.
రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న పోలీస్ డ్రామా షూట్లో శిల్పా శెట్టి కాలు ఫ్రాక్చర్ అయింది. కాలు విరిగినా వర్కవుట్ సెషన్‌ను ఆమె మిస్ కాలేదు. ఎలాంటి స్ధితిలోనైనా ముందుకు వెళ్లడమే నంటూ జిమ్‌లో శిల్పా శెట్టి వర్కవుట్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. అప్పర్ బాడీ బలోపేతం కోసం ఆమె కసరత్తులు చేస్తూ ఆ వీడియోలో కనిపించింది.
గత కొద్ది వారాలుగా వర్కవుట్లను మిస్ కావడం లేదని కాలి ఫ్రాక్చర్ నుంచి పూర్తిగా కోలుకునేవరకూ అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ కోసం అనువైన వ్యాయామలు చేస్తూ టైమ్‌ను సరిగ్గా వినియోగించుకుంటున్నానని ఆమె క్యాప్షన్‌లో రాసుకొచ్చారు. తాను నిపుణుడి సూచనలతోనే వర్కవుట్లు చేస్తున్నానని, మీరూ గాయంతో బాధపడుతూ వర్కవుట్లు చేయాలంటే ఎక్స్పర్ట్స్ గైడెన్స్‌లో చేయాలని సూచించింది.