విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరవుతూ చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఇంట్లో తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శశిధర్ శర్మ అన్నారు.
చిగురుమామిడి, నవంబర్ 4 : విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరవుతూ చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఇంట్లో తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శశిధర్ శర్మ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులతో అధ్యాపకుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అధ్యాపకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించి మంచి క్రమశిక్షణ అలవర్చుకునేలా చూడాలన్నారు. ఈ విద్యా సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధించేందుకు అందరం సమిష్టిగా కృషి చేయాలని కోరారు. చెడు స్నేహానికి తావు లేకుండా ఇంటి వద్ద తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలు, సూచనలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
Vocational Trainers | 12 నెలల జీతాల్లేవ్.. సెక్రటేరియట్ ముందు ఒకేషనల్ ట్రైనర్ల ఆందోళన.. వీడియో
Cancer | క్యాన్సర్‌ను నయం చేస్తామంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Kishore Movie Makers | కిషోర్ మూవీ మేకర్స్ తొలి చిత్రం ప్రారంభం.. ముఖ్య అతిథులుగా వీవీ వినాయక్, ఆది సాయికుమార్
Dharman | అఫిషీయల్.. రజనీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

