LSG vs PBKS : పంతొమ్మిదో సీజన్లో అజేయంగా దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు తొలి ఓవర్లోనే షాకిచ్చాడు షమీ. ముల్లన్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మూడో బంతికే ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను పెవిలియన్ పంపాడు. స్లిప్‌లో మార్ష్ క్యాచ్ పట్టగా పంజాబ్ ఓపెనర్ నిరాశగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ప్రియన్స్ ఆర్య(10), కూపర్ కొన్నొల్లీ(13) క్రీజులో ఉన్నారు.
ఐదు మ్యాచుల్లో రెండే గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఈ మ్యాచ్‌లో విజయంపై కన్నేసింది. టాస్ గెలిచిన కెప్టెన్ రిషభ్ పంత్ ఓటమన్నదే ఎరుగని పంజాబ్ కింగ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్లో గొప్పగా రాణిస్తున్న షమీ తొలి ఓవర్లోనే డేంజరస్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(0)ను ఔట్ చేసి లక్నోకు బ్రేకిచ్చాడు. 3 ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 26-1.
A wicket in the very first over ☝️
Just another normal day for Mohd. Shami ❤️💙
Updates ▶️ https://t.co/u5eUR1dSo2#TATAIPL | #KhelBindaas | #PBKSvLSG pic.twitter.com/Xuviamck4g
— IndianPremierLeague (@IPL) April 19, 2026
లక్నో తుది జట్టు : ఎడెన్ మర్క్రమ్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), పూరన్, బదొని, ముకుల్ చౌదరీ, షమీ, అవేశ్ ఖాన్, ప్రిన్స్, సిద్ధార్థ్, మొహ్సిన్ ఖాన్.
ఇంప్యాక్ట్ సబ్స్ – అబ్దుల్ సమద్, దిగ్వేశ్ రథీ, బ్రీట్జ్, మయాంక్ యాదవ్, హిమ్మత్ సింగ్.
పంజాబ్ తుది జట్టు : ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కొన్నొల్లీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, నేహల్ వధేరా, స్టోయినిస్, యాన్సెన్, బార్ట్లెట్, అర్ష్‌దీప్, చాహల్.
ఇంప్యాక్ట్ సబ్స్ – విజయ్‌కుమార్, హర్‌ప్రీత్ బ్రార్, సుర్యాన్ష్ శెడ్గే, యశ్ ఠాకూర్, విష్ణు వినోద్