Fire accident : నిరుపేదలు నివాసం ఉండే ఓ మురికివాడలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. దాంతో అందరూ తమ సామాగ్రిని వదిలి ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. క్షణాల్లో వాడ మొత్తం కాలిబూడిదైంది. హర్యానాలోని రేవారీ జిల్లా కోన్సివాస్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. మురికి వాడలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది (Fire Fighters) కి సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
#WATCH | Haryana: A massive fire breaks out in slums at Konsiwas Road in Rewari. Fire tenders rushed to the spot. Firefighting operations are underway. pic.twitter.com/KCTdPFmomm
— ANI (@ANI) April 19, 2026