Shah Rukh Khan | షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సంచలనం.. విడుదల ముందే రూ. 800 కోట్ల భారీ బిజినెస్!
Shah Rukh Khan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'కింగ్' తెరపైకి రాకముందే బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.
Shah Rukh Khan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కింగ్’ తెరపైకి రాకముందే బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే, సినిమా థియేటర్లోకి రాకముందే ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగా భారీ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల విడుదలైన ‘తు మిలా జాయే’ (Tu Mila Jaye) సాంగ్ టీజర్, రొమాంటిక్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.
పలు మీడియా నివేదికల ప్రకారం.. ‘కింగ్’ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్, థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్, ఓవర్సీస్ రైట్స్, మ్యూజిక్ అలాగే శాటిలైట్ లేదా టెలివిజన్ హక్కుల ద్వారా దాదాపు రూ. 800 కోట్లకు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ లావాదేవీలను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ భారీ డీల్స్ కారణంగా బాలీవుడ్ చిత్రసీమలో ఈ ప్రాజెక్ట్ అత్యంత భారీ క్రేజ్ సంపాదించుకున్న చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ పెట్టిన నిర్మాణ వ్యూహం కూడా హాట్ టాపిక్ అయింది. ‘కింగ్’ సినిమా అంచనా బడ్జెట్ దాదాపు రూ. 350 కోట్ల నుండి రూ. 450 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అంటే సినిమా విడుదలకు ముందే తన నిర్మాణ ఖర్చును సులభంగా అధిగమించడమే కాకుండా, పెట్టిన పెట్టుబడికి దాదాపు రెట్టింపు లాభాలను ప్రీ-రిలీజ్ డీల్స్ ద్వారా వెనక్కి రాబట్టినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ తో పాటు ఆయన కూతురు సుహానా ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, దీపికా పదుకొణె కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, రాణి ముఖర్జీ, జైదీప్ అహ్లావత్, జాకీ ష్రాఫ్, రాఘవ్ జుయల్ మరియు అభయ్ వర్మ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో ఉన్నట్లు సమాచారం. సిద్ధార్థ్ ఆనంద్ టేకింగ్, భారీ స్టార్ కాస్ట్ మరియు రికార్డు స్థాయి ప్రీ-రిలీజ్ బిజినెస్ తో ‘కింగ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shah Rukh Khan | షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సంచలనం.. విడుదల ముందే రూ. 800 కోట్ల భారీ బిజినెస్!
ACP Manasvi Vashistha: ఎవరీ మనస్వి వశిష్ట.. ఢిల్లీ ఏసీపీని ఎందుకు బదిలీ చేశారు?
Mahabubabad | బైపాస్ వద్ద గుండె, లివర్‌ను పోలిన అవయవాలు.. మహబూబాబాద్ జిల్లాలో కలకలం!
బాచారం ఉర్సు వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
Sridhar Babu vs Gaddam Vamsi | వారిని సస్పెండ్ చేయవద్దు.. మంత్రి శ్రీధర్‌బాబుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చురకలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

