Sridhar Babu vs Gaddam Vamsi | వారిని సస్పెండ్ చేయవద్దు.. మంత్రి శ్రీధర్‌బాబుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చురకలు!
Sridhar Babu vs Gaddam Vamsi | తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. పెద్దపల్లి జిల్లా రాజకీయాల్లో మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య విభేదాలు తాజాగా తెరపైకి వచ్చాయి.
Sridhar Babu vs Gaddam Vamsi | తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. పెద్దపల్లి జిల్లా రాజకీయాల్లో మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ మధ్య విభేదాలు తాజాగా తెరపైకి వచ్చాయి. ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన రాహుల్ గాంధీ సభకు హాజరుకాని ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ ఠాకూర్, విజయరమణారావులపై సస్పెన్షన్ వేటు వేయొద్దంటూ మంత్రి శ్రీధర్‌బాబుకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ వ్యంగ్యంగా లేఖ రాయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గతంలో పిల్లలకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసినందుకు నేతలను సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఇప్పుడు సభకు రాని నేతలపైనా అదే చర్య తీసుకోవద్దంటూ ఆయన చురకలు అంటించారు.
నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన భారీ సభకు పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈ సభకు ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ ఠాకూర్, విజయరమణారావుతో పాటు మంత్రి శ్రీధర్‌బాబు కూడా హాజరుకాలేదనే అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ రాసిన లేఖ పార్టీలో చర్చకు దారితీసింది.
గతంలో కాకా ట్రస్టు ఆధ్వర్యంలో ఓ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసినందుకు ఓ మహిళా ప్రజాప్రతినిధితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలపై సస్పెన్షన్ వేటు వేసిన విషయాన్ని వంశీకృష్ణ తన లేఖలో ప్రస్తావించారు. పిల్లలకు మంచి పని చేసినందుకే వారిపై చర్యలు తీసుకున్నారని వ్యంగ్యంగా పేర్కొన్నారు. అదే తరహాలో ఢిల్లీలో రాహుల్ గాంధీ నిర్వహించిన సభకు హాజరుకాని శ్రీధర్‌బాబు, మక్కన్ సింగ్ ఠాకూర్, విజయరమణారావులను కూడా సస్పెండ్ చేయాలని కోరాలా? అంటూ చురకలు అంటించారు.
అలాగే కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ, నాయకుల బాధ్యతలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. సభకు హాజరుకాని నేతలపై చర్యలు తీసుకోవాలనే వాదనను వ్యంగ్యంగా ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్‌బాబుకు రాసిన ఈ లేఖ ద్వారా పార్టీలోని అంతర్గత పరిస్థితులపై తన అసంతృప్తిని వంశీకృష్ణ వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇప్పటికే పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌లో మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ లేఖతో ఆ విభేదాలు మరోసారి చర్చకు వచ్చాయి. అసలే ప్రజల్లో పార్టీ నాయకులపై వ్యతిరేకత ఉందని భావిస్తున్న తరుణంలో.. నేతల మధ్య అంతర్గత విభేదాలు పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయని కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

Gaddam Vamsikrishna Sridhar
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Babu vs Gaddam Vamsi | వారిని సస్పెండ్ చేయవద్దు.. మంత్రి శ్రీధర్‌బాబుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చురకలు!
Indian sailer | ఒమన్ తీరంలో భారత నౌకపై దాడి.. ఇండియన్ సెయిలర్ దుర్మరణం..!
NRI | కేటీఆర్ చొరవతో స్వదేశానికి చేరుకున్న కొడంగల్ గల్ఫ్ బాధితురాలు
Achampet | అచ్చంపేటలో బాలింత మృతి.. పరిస్థితి ఉద్రిక్తం
ఆస్తి కోసం దారుణం.. మహిళ తల, మొండెం వేరుచేసి హత్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

