బాచారం ఉర్సు వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
బాచారం గ్రామంలో సోమవారం నిర్వహించిన ఉర్సు వేడుకల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
పాపన్నపేట, నవంబర్ 3 : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం బాచారం గ్రామంలో సోమవారం నిర్వహించిన ఉర్సు వేడుకల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పవిత్ర దుర్గయ్య ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని మహిళలతో ఆప్యాయంగా ముచ్చటించిన పద్మాదేవేందర్‌రెడ్డి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముస్లిం మత పెద్దలు సయ్యద్ ఏజుదానిహుస్సేన్, కూతుబుహుస్సేన్, జాకీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉర్సు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా నిర్వహించుకునే పండుగలు, ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. ఉర్సు వేడుకలు భక్తి, విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో మతసామరస్యాన్ని, పరస్పర గౌరవాన్ని చాటిచెబుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో ఉర్సు వేడుకలను నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు జగన్, సర్పంచులు కాశీనాథ్‌రావు, సురేష్, దశరథ్, మాజీ సర్పంచులు గురుమూర్తి, లింగారెడ్డి, మల్లేశం, శ్రీనాథ్, సంగప్ప, నాయకులు సీహెచ్. బిక్షపతి, దుర్గయ్య, పోలీస్ లక్ష్మణ్,రాము, జానకి బాలు, జెట్టిగారి కృష్ణ, చారి,మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు జుబేర్ అహ్మద్, సోహెల్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubabad | బైపాస్ వద్ద గుండె, లివర్‌ను పోలిన అవయవాలు.. మహబూబాబాద్ జిల్లాలో కలకలం!
బాచారం ఉర్సు వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
Sridhar Babu vs Gaddam Vamsi | వారిని సస్పెండ్ చేయవద్దు.. మంత్రి శ్రీధర్‌బాబుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చురకలు!
Indian sailer | ఒమన్ తీరంలో భారత నౌకపై దాడి.. ఇండియన్ సెయిలర్ దుర్మరణం..!
NRI | కేటీఆర్ చొరవతో స్వదేశానికి చేరుకున్న కొడంగల్ గల్ఫ్ బాధితురాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

