ACP Manasvi Vashistha: ఎవరీ మనస్వి వశిష్ట.. ఢిల్లీ ఏసీపీని ఎందుకు బదిలీ చేశారు?
ACP Manasvi Vashistha: ఢిల్లీ పోలీసు శాఖలోని ఏసీపీ మనస్వీ వశిష్టను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆయన బదిలీని వ్యతిరేకిస్తూ పోలీసు సిబ్బంది సోమవారం హెడ్‌క్వార్టర్స్‌లో ధర్నా చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసు శాఖలోని ఏసీపీ మనస్వీ వశిష్ట(ACP Manasvi Vashistha)ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆయన బదిలీని వ్యతిరేకిస్తూ కొందరు పోలీసులు సిబ్బంది సోమవారం ఆందోళన వ్యక్తం చేసిన ఘటన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. అయితే షాదారా పోలీసు స్టేషన్లో లాయర్లను ఇద్దరు ఆఫీసర్లు బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ఏసీపీ మనస్వీ వశిష్టను బదిలీ చేసినట్లు తెలిసింది. సోమవారం పోలీసు ప్రధానకార్యాలయం ముందు జరిగిన నిరసన ప్రదర్శలో వశిష్ట పాల్గొన్నారు. ట్రాన్స్ఫర్ ఆర్డర్‌ను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసు ప్రధాన కార్యాయంలో ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఏసీపీ వశిష్టను సస్పెండ్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
బదిలీకి ముందు ఏసీపీ వశిష్ట.. షాదారా సబ్‌డివిజన్‌లోని గాంధీనగర్ లో సబ్ డివిజినల్ పోలీసు ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. అక్టోబర్ 28వ తేదీన స్పెషల్ పోలీసు యూనిట్ ఫర్ వుమెన్ అండ్ చిల్ట్రన్ శాఖకు ఆయన్ను బదిలీ చేశారు. షాదారా పోలీసు స్టేషన్లో ఎస్‌హెచ్‌వోగా చేస్తున్న ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్‌ను కూడా ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన సెక్యూర్టీ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఢిల్లీ పోలీసు అధికారులు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, జిల్లా కోర్టు బార్ సంఘాల ఆఫీస్ బేరర్ల ప్రతినిధులతో జరిగిన మీటింగ్ తర్వాత ఇద్దరు ఆఫీసర్లను బదిలీ చేశారు.
పోలీసు శాఖ బదిలీ ఆదేశాలు ఇచ్చిన తర్వాత జిల్లా కోర్టు బార్ సంఘాలు తమ నిరవధిక నిరసనను వెనక్కి తీసుకున్నారు. పోలీసు ఆఫీసర్లపై చర్యలు తీసుకునే వరకు తాము న్యాయ విధులకు హాజరుకాబోమని లాయర్లు భీష్మించారు. అయితే అక్టోబర్ 23వ తేదీన షాదారా పోలీసు స్టేషన్లో లలిత్ బన్సల్ అనే అడ్వకేట్ పై దాడి జరిగింది. ఆ ఘర్షణలో అతని తలకు గాయమైంది. ఈ కేసులో అమూల్య రతన అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. బన్సల్‌పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లాయర్లు, అడ్వకేట్లు పోలీసు స్టేషన్ వెళ్లారు. కేసులో ఉన్న వ్యక్తులను అరెస్టు చేస్తామని వశిష్ట, ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అయితే అక్టోబర్ 24వ తేదీన నిందితులను రిలీజ్ చేసినట్లు లాయర్లు గ్రహించారు. విషయం తెలుసుకుందామని పోలీసు స్టేషన్‌కు వెళ్లినప్పుడు, రివాల్వర్‌ను చూపిస్తూ.. అడ్వకేట్లను ఏసీపీ వశిష్ట బెదిరించాడు. పోలీసుల వైఖరిని ఖండిస్తూ న్యాయ విధులకు లాయర్లు డుమ్మాకొట్టారు. పోలీసులపై చర్యలు తీసుకునే వరకు దీక్ష కొనసాగిస్తామన్నారు. దీంతో ఆ ఆఫీసర్లను బదిలీ చేస్తూ అక్టోబర్ 28వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాతే లాయర్లు తమ నిరసన విరమించారు. కానీ ఇద్దరు ఆఫీసర్ల బదిలీ అంశంలో ఢిల్లీ పోలీసు శాఖలో విభిన్నస్వరాలు వినిపించాయి. బదిలీ చేయవద్దు అని కొందరు డిమాండ్ చేశారు. ఆఫీసర్లకు మద్దతుగా నవంబర్ 2న పోలీసు హెడ్‌క్వార్టర్స్ ముందు ధర్నాకు రావాలని పోలీసు వాట్సాప్ గ్రూపులో మెసేజ్ సర్క్యూలేట్ అయ్యింది.
2వ తేదీన సుమారు 100 మంది పోలీసులు సిబ్బంది హెడ్‌క్వార్టర్స్ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శించారు. పోలీసు కమీషనర్‌తో మీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACP Manasvi Vashistha: ఎవరీ మనస్వి వశిష్ట.. ఢిల్లీ ఏసీపీని ఎందుకు బదిలీ చేశారు?
Mahabubabad | బైపాస్ వద్ద గుండె, లివర్‌ను పోలిన అవయవాలు.. మహబూబాబాద్ జిల్లాలో కలకలం!
బాచారం ఉర్సు వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
Sridhar Babu vs Gaddam Vamsi | వారిని సస్పెండ్ చేయవద్దు.. మంత్రి శ్రీధర్‌బాబుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చురకలు!
Indian sailer | ఒమన్ తీరంలో భారత నౌకపై దాడి.. ఇండియన్ సెయిలర్ దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

