రీసెంట్గా షారుక్‌ఖాన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘మీరు ఇప్పటివరకూ హాలీవుడ్ సినిమా ఎందుకు చేయలేదు?’ అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ‘హాలీవుడ్ సినిమా చేయాలంటే ముందు ఆ స్థాయిలో ఇంగ్లిష్ మాట్లాడగలిగే భాషా ప్రావీణ్యం నాకు కావాలి. ఎందుకంటే నేను ఇంగ్లిష్‌లో కాస్త వీక్.
అలాగే ఇండియన్ ఆడియన్స్ నాకు ఎంతో గౌరవం ఇచ్చారు. నా కుటుంబాన్ని కూడా అంతే గౌరవంగా ఆదరిస్తున్నారు. వారందరూ తృప్తి పడేంత గొప్ప పాత్ర దొరకాలి. మొత్తంగా చెప్పేదేంటంటే.. ఇందులో మొదటి సమస్య నాదైతే… రెండో సమస్య విధిది. ఈ రెండూ కలిసొస్తే.. తప్పకుండా ఫ్యూచర్లో హాలీవుడ్ సినిమా చేస్తా. అలాగే.. హాలీవుడ్ ప్రేక్షకులతో కూర్చుని ఇండియన్ సినిమా చూడటం నా కల. ఆ కల ఎప్పుడు తీరుతుందా? అని ఎదురు చూస్తున్నా’ అన్నారు షారుక్.