INDW vs SLW : మహిళల ఆసియా కప్ ఫైనల్లో భారత ఓపెనర్లు షఫాలీ వర్మ(68), స్మృతి మంధాన(59) రెచ్చిపోయారు. శ్రీలంక బౌలర్లను ఎడాపెడా ఉతికేసిన ఈ ద్వయం అర్ధశతకాలతో కదంతొక్కి.. రికార్డు భాగస్వామ్యం నెలకొల్పింది. వీరిద్దరూ ఔటయ్యాక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(17), రీచా ఘోష్(14)లు దూకుడుగా ఆడడంతో లంక బౌలర్లు చేష్టలుడిగిపోయారు. టాపార్డర్ మెరుపులతో టీమిండియా ఆసియా కప్ ఫైనల్ చరిత్రలోనే భారీ స్కోర్ కొట్టింది.
మహిళల ఆసియా కప్ ఫైనల్లో భారత ఓపెనర్లు చితక్కొట్టారు. ఎనిమిదో టైటిల్ లక్ష్యంగా టీమిండియాకు శుభారంభమిస్తూ.. ఇన్నింగ్స్ మొదటి బంతినే స్మృతి మంధాన(59) బౌండరీకి తరలించగా.. ఆ తర్వాత కవిశ దిల్హరి ఓవర్లో షఫాలీ వర్మ(68) రెండు ఫోర్లతో చెలరేగింది. వీరిద్దరి విధ్వంసంతో పవర్ ప్లేలోనే వికెట్ పడకుండా టీమిండియా 57 పరుగులు చేసింది. కాసేపటికే కవిశ ఓవర్లో బౌండరీతో అర్ధశతకం అందుకుంది షఫాలీ. 24 బంతుల్లోనే 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో టీ20ల్లో 21వ ఫిఫ్టీ సాధించింది తను.
6⃣8⃣ Runs
3⃣9⃣ Deliveries
9⃣ fours & 2⃣ sixes
1⃣7⃣4⃣.3⃣6⃣ strike rateBigger the occasion, bigger the impact ft. Shafali Verma 😎
Updates ▶️ https://t.co/knKLXGSfOd #TeamIndia | #WomensAsiaCup | #INDvSL | @TheShafaliVerma pic.twitter.com/NG3V2y2Vjz
— BCCI Women (@BCCIWomen) September 13, 2026
లంక బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన ఈ జోడీ 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రబోధ ఓవర్లో షఫాలి వెనుదిరిగాక.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(14)తో సమన్వయం లోపంతో మంధాన రనౌటైంది. అనంతరం హర్మన్‌ప్రీత్ జతగా రీచా ఘోష్(17) ఉతికేసింది. ఓవర్లో 6, 4 తో రెచ్చిపోయింది రీచా. అఇయతే. ధాటిగా ఆడే క్రమంలో ఇద్దరూ త్వరగా ఔటయ్యారు. ఆఖర్లో కమలిని(15 నాటౌట్), భారతి పుల్మాలి(2)లు రాణించగా.. 20వ ఓవర్లో 16 రన్స్ వచ్చాయి. ఫలితంగా వెంటవెంటనే ముగ్గురు ఔటైనా టీమిండియా 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.
#AsiaCupFinal | India finish on 183-5 in the first innings 🇮🇳
Sri Lanka need 184 to win their second Asia Cup title 🇱🇰 🏆
Follow ball-by-ball updates: https://t.co/uvskvz32Sj
— Cricinfo (@cricinfo) September 13, 2026