హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అటవిశాఖ మంత్రి కొండా సురేఖ ( Konda Surekha ) కు చెక్ పెట్టింది. ఆమెకు తెలియకుండానే పలువురు ఐఎఫ్ఎస్ (IFS ) అధికారులు, ఇతర ఉన్నతాధికారుల డిప్యూటేషన్లను రద్దు ( Deputations Cancell ) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రిపై కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన అనుచిత వ్యాఖ్యలు కొన్ని రోజులుగా రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల నుంచి సోమవారం ఉదయం తిరిగి వచ్చిన తరువాత వరుస భేటీల అనంతరం సాయంత్రం మీడియా సమావేశంలో తన అమెరికా పర్యటన రద్దు పై కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేసిన ఆటంకాలపై విరుచుకు పడ్డారు. అనంతరం కొండా సురేఖ అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా క్రమ శిక్షణ కమిటీ అన్నింటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించిన గంట వ్యవధిలోనే కొండా సురేఖ శాఖల్లో ముఖ్యమైన అటవిశాఖలో డిప్యూటేషన్ల రద్దు సంచలనంగా మారింది .
డిప్యూటేషన్‌పై ఉన్న అధికారులను పీసీసీఎఫ్ ( PCCF ) కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అది కూడా ఆమెకు తెలియకుండానే ఉత్తర్వులు వెలువడడంతో ఆమెకు పొమ్మన లేక పొగబెడుతున్నారని సర్వత్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.