కొండాపూర్, జనవరి 22 : మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ‘కూర్మా’ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లోని చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. కూర్మా (తాబేలు) ఆకారంతో కూడిన ఫైబర్ గ్లాస్‌పై ప్రముఖ కళాకారులు గీసిన పలు రకాల చిత్రాలు ప్రత్యేంగా ఆకట్టుకున్నాయి. కూర్మా ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను తెలంగాణ స్టేట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళలు, కళాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కే లక్ష్మీ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్పీ సింగ్, కళాకారులు లక్ష్మాగౌడ్, నగేశ్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.