రవీంద్రభారతి, నవంబర్ 27 : ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణకు వ్యతిరేకంగా కొందరు మాలలు ఉన్నత న్యాయస్థానాల్లో వాజ్యాలు వేయడం సామాజిక అన్యాయమని, ఇదీ అంబేద్కర్ సామాజిక న్యాయస్ఫూర్తికి విరుద్ధమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పీ కృపాకర్ మాదిగ అన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ, తెలంగాణ మాదిగ దండోర వ్యవస్థాపక అధ్యక్షుడు చింత స్వామి మాదిగతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 20 మాదిగ, ఎస్సీ ఉపకులాల సంఘాల నాయకులు, ప్రతినిధులు డిసెంబర్ 14లోగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఏకసభ్య కమిషన్ ముందు పిటిషన్ దాఖలు చేయాలని కోరారు.