హైదరాబాద్ : స్వచ్ఛంద పదవీ విరమణ కోసం సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ దరఖాస్తు చేసుకున్నారు. ఆరేళ్ల సర్వీసు ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. పోలీసు శాఖలో పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని వెల్లడించారు. ఈ సందర్భంగా 26 ఏళ్లపాటు సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
సామాజిక న్యాయం, సమానత్వం కోసం మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు. పదవీ విరమణపై ప్రభుత్వ కార్యదర్శికి లేఖ పంపినట్లు తెలిపారు. ప్రవీణ్‌కుమార్ 1995 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శిగా సేవలు అందించారు.
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) July 19, 2021