తిరుమల : కశ్మీర్‌లోని పహల్గాం ( Pahalgam) ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం హెచ్చరికల మేరకు తిరుమలలో భద్రతను (Tirumala Security ) మరింత పటిష్టం చేశారు. తిరుమల పోలీసు, విజిలెన్స్, ఆక్టోపస్ బలగాలు ఈ సందర్భంగా గురువారం మాక్ డ్రిల్‌ను నిర్వహించాయి. ఉగ్రవాదులు దాడులకు పాల్పడితే పౌరులు, భక్తులను కాపాడేందుకు ముందస్తుగా మాక్ డ్రిల్‌ను ( Mockdril l) నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.
అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాల్లో వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి కొండపైకి పంపిస్తున్నారు. తిరుమల ఆలయ పరిసరాల్లో ప్రత్యేక భద్రతను పెంచారు. మంగళవారం మధ్యాహ్నం పహల్గాంలో ముష్కరులు దాడులు జరిపి 27 మంది పర్యాటకులను కిరాతకంగా చంపి, మరికొంత మందిని తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే.