హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లోని సీట్ల భర్తీకి రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రవేశాల కమిటీ చైర్మన్ పాండురంగారెడ్డి విడుదల చేశారు.
బుధవారం నుంచి ఈ నెల 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, 16 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని, 21న సీట్లు కేటాయిస్తామని పాండురంగారెడ్డి తెలిపారు.