మరో అవకాశం.. రొమాన్స్ రిబూట్
విడాకులైన అమ్మాయికి మళ్లీ పెళ్లి అంత సులభం కాదు. అబ్బాయిలకైనా తీవ్ర సమస్యే. అలాంటి జీవితాలు అక్కడితోనే ఆగిపోకుండా.. మరో ప్రయాణం మొదలుపెట్టేందుకు ‘రొమాన్స్ రిబూట్' డేటింగ్ కమ్యూనిటీ సహకరిస్తుంది
విడాకులైన అమ్మాయికి మళ్లీ పెళ్లి అంత సులభం కాదు. అబ్బాయిలకైనా తీవ్ర సమస్యే. అలాంటి జీవితాలు అక్కడితోనే ఆగిపోకుండా.. మరో ప్రయాణం మొదలుపెట్టేందుకు ‘రొమాన్స్ రిబూట్’ డేటింగ్ కమ్యూనిటీ సహకరిస్తుంది. ‘పరిచయానికే పరిమితం అవుతారా, స్నేహాన్ని కొనసాగిస్తారా, జీవిత భాగస్వామిగా ఆహ్వానిస్తారా.. అన్నది వాళ్ల ఇష్టం’ అంటారు ఆ వేదిక వ్యవస్థాపకురాలు అభినీత.
భారతీయ వివాహాలు నూటికి ఎనభైశాతం యాదృచ్ఛికంగానే జరుగుతాయి. వధూవరుల ఇష్టాలతో ప్రమేయం ఉండదు. ఒకరి అభిరుచుల్ని మరొకరు తెలుసుకునే ప్రయత్నమే జరుగదు. దీంతో మూడుముళ్ల తర్వాత వరుస షాక్‌లు మొదలవుతాయి. కొందరు రాజీపడతారు. కొందరి విషయంలో విడిపోవడం అనివార్యం అవుతుంది. జీవిత భాగస్వామి హఠాన్మరణాలూ కొందరిని ఒంటరివాళ్లను చేస్తాయి. ఇలాంటి జీవితాల్లో కొత్త వెలుగులు నింపడమే తన లక్ష్యమని అంటున్నది ‘రొమాన్స్ రిబూట్’. ఈ డేటింగ్ కమ్యూనిటీ రెండేండ్ల క్రితం మొదలైంది. ఈ బృందంలోని సభ్యులు అప్పుడప్పుడూ కలుసుకుంటారు. కుదరని వారికి ఆన్లైన్ మీట్ ఉంటుంది. విడాకులైనవాళ్లు, జీవిత భాగస్వామి మరణించిన వాళ్లు ఇందులో చేరవచ్చు. అదీ, ‘రొమాన్స్ రిబూట్’ వ్యవస్థాపకురాలు అభినీత నిర్వహించే ఇంటర్వ్యూలో పాసైతేనే! ‘ఎందుకు డైవోర్స్ అయింది? లాంగ్‌టర్మ్ రిలేషన్షిప్ కావాలా? షార్ట్‌టర్మ్ రిలేషన్షిప్ కావాలా? ఉద్యోగం చేస్తున్నారా? వ్యాపారం చేస్తున్నారా? వార్షిక ఆదాయం ఎంత? పిల్లలున్నారా? ఇంట్లో పరిస్థితులు ఏమిటి? మీ ఇష్టాలేమిటి? జీవిత లక్ష్యాలేమిటి?’.. ఇలాంటి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు చెబితేనే ‘రొమాన్స్ రిబూట్’ కమ్యూనిటీలో ప్రవేశం దొరుకుతుంది. నిజమే, జీవితంలో ఒకసారి దెబ్బతిన్నాక సవాలక్ష సందేహాలు మనసును తొలిచేస్తుంటాయి. అవతలి మనిషి ఎవరో తెలియదు. ఎలాంటి వారో తెలియదు. విడాకులు తీసుకున్నవారికి రెండో పెళ్లి విషయంలో ఇంట్లో తీవ్ర ఒత్తిడి కూడా ఉంటుంది. నిన్నమొన్నటి చేదు అనుభవం పునరావృతం కాకూడదనే ఆలోచనతో చాలామంది ‘రొమాన్స్ రిబూట్’కు వస్తారు.
మనోబలం కోసం..
పిల్లలు పుట్టాక విడాకులైనా, భర్త చనిపోయినా ఇంకో వివాహం చేయడానికి పెద్దలు అంగీకరించరు. పిల్లలేమో అర్థం చేసుకోలేరు. కొత్త నాన్న వద్దంటారు. అమ్మ తమతోనే ఉండాలంటారు. విడాకులైనవాళ్లు మళ్లీ పెళ్లి
చేసుకున్నా కూడా..
ఎక్కువ కాలం కలిసి ఉండలేక పోతున్న సందర్భాలే అనేకం. కారణం.. సరైన తోడు లభించకపోవడం. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక అవసరాలకు తగిన జీవిత భాగస్వామిని ఎంచుకోలేకపోవడం. ఇలాంటి విషయాల్లో పెళ్లికి ముందు ఒకరి పట్ల ఒకరు అవగాహన పెంచుకోవడం, ఆలోచనలు పంచుకోవడం, కుటుంబాలను ఒప్పించడం, పిల్లలకు అర్థం చేయించడం చాలాముఖ్యం. ఇవన్నీ ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియకపోతే సమస్యలు వస్తాయి. ‘రొమాన్స్ రిబూట్’ సభ్యులకు ఆ ఇబ్బంది ఉండదు. ఇక్కడ మనోబలం పెంచడానికి నిపుణులైన సైకాలజిస్టులు ఉంటారు.
సరైన జోడి..
‘వివాహం అనేది నమ్మకం మీద నిలబడాలి, అబద్ధాల పునాదులపైన కాదు’ అంటారు అభినీత. సభ్యులు నిజాలు మాట్లాడేలా ప్రోత్సహిస్తారామె. ‘మా కమ్యూనిటీలో చేరిన వారిలో సగానికి సగం ఆడవాళ్లు గృహహింస ఊబి నుంచి బయటపడినవారే. హింసా ప్రవృత్తి ఉన్న వ్యక్తిని మరోసారి జీవితంలో ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండరు. మగవాళ్ల విషయానికొస్తే.. అంతకు ముందు పెళ్లి వల్ల భార్యకు భరణం చెల్లించడం, కోర్టు ఖర్చులు భరించడం.. తదితర కారణాలతో ఆర్థికంగా నష్టపోయి ఉంటారు. కాబట్టి, రెండో భాగస్వామి ఆర్థికంగా స్వతంత్రురాలై ఉండాలని కోరుకుంటారు. ఎవరి మనసులో ఏం ఉందో తెలుసుకుని.. వాళ్లకు ఎలాంటి తోడు అవసరమనే అంచనాకు వస్తాం. వర్క్‌షాప్‌లో రకరకాల కార్యక్రమాలు చేయిస్తాం. నాటకాలు వేయిస్తాం. కథలు చెప్పిస్తాం. ఇలా అందరూ కలిసిపోతారు. రోజంతా మాట్లాడుకున్న తర్వాత అందరికీ ఓ ఫామ్ ఇస్తాం. తమ మనసుకు దగ్గరగా ఉన్నవారి పేర్లు రాయమని చెబుతాం. అలా ఆడవాళ్లు, మగవాళ్లు ఇచ్చిన ఫారాలన్నీ విశ్లేషిస్తాం. పేర్లు మ్యాచ్ అయితే.. భేటీకి ఏర్పాటు చేస్తాం. లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తాం. స్నేహం, ప్రేమ, పెళ్లి .. ఏ మార్గాన్ని ఎంచుకుంటారన్నది వాళ్లిష్టం’ అంటూ రొమాన్స్ రిబూట్ పనితీరును వివరిస్తారామె. హైదరాబాద్ కమ్యూనిటీలో 200 మందికి పైగా చేరారు. వీళ్లలో 35 నుంచి 50 ఏళ్ల వారు ఉన్నారు. ఈ సంస్థ ముంబై, బెంగళూరులకూ విస్తరించింది. త్వరలోనే మరిన్ని నగరాల ఒంటరి జీవులను పలకరిస్తామంటున్నారు అభినీత.
(abhineeta6@gmail.com)
మా ఆయన బంగారం!
మాది బెంగళూరు. హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో ఎంఏ (లింగ్విస్టిక్స్) చదివేందుకు వచ్చాను. తర్వాaత స్టార్టప్స్‌లో ఉద్యోగంలో చేరాను. పెండ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. మా ఫ్యామిలీలో, ఫ్రెండ్స్‌లో విడాకులు తీసుకున్నవాళ్లు ఉన్నారు. వాళ్లను చూశాక పెళ్లి అవసరమా? అనే ఆలోచన వచ్చింది. రొమాన్స్ రిబూట్ ప్రారంభించిన తర్వాత ఉద్యోగం మానేశాను. ఇందులోనే తృప్తి ఉంది, ఆదాయమూ ఉంది. మా అమ్మ నాకు సంబంధం చూసింది. అతనికి పళ్లైంది. గతంలో విడాకులు తీసుకున్నాడు. షెఫ్‌గా పని చేస్తాడు.
– అభినీత రఘునాథ్
సీఈఓ, రొమాన్స్ రిబూట్
- నాగవర్ధన్ రాయల
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

