న్యూఢిల్లీ, నవంబర్ 22: ఫార్మసీ రిటైల్ చైన్‌ను నిర్వహిస్తున్న హైదరాబాదీ కంపెనీ మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ ప్రతిపాదించిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు (ఐపీవో) మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదముద్ర వేసింది. ఐపీవో ద్వారా రూ. 1,639 కోట్లు సమీకరిచాలని మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్..సెబికి సమర్పించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌లో పేర్కొం ది. తాజా ఈక్విటీ షేర్ల జారీతో రూ. 600 కోట్లు ఈ కంపెనీ సేకరించనుండగా, మరో రూ.1,039 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత షేర్హోల్డర్లు ఆఫర్ ఫర్ సేల్‌గా (ఓఎఫ్ఎస్) విక్రయించనున్నారు. వోఎఫ్ఎస్లో రూ.400 కోట్ల విలువైన షేర్లను లోన్ ఫురో ఇన్వెస్ట్మెంట్స్, రూ.500 కోట్లు పీఐ ఆపర్చూనిటీస్ ఫండ్, మరో రూ. 89 కోట్లు ఇతర షేర్హోల్డర్లు ఆఫ్‌లోడ్ చేస్తారు. తాజా ఈక్విటీ జారీ ద్వారా సమీకరించే నిధుల్ని కంపెనీ సబ్సిడరీ ఆప్టివాల్ హెల్త్ సొల్యూషన్స్ వర్కింగ్ మూలధనం కోసం ఉద్దేశించినట్లు మెడ్‌ప్లస్ తెలిపింది.
మరో 5 కంపెనీలకూ అనుమతి..
మెడ్ప్లస్తో పాటు మరో ఐదు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకూ సెబీ అనుమతి తెలిపింది. ట్రావెల్ టెక్నాలజీ సర్వీసుల సంస్థ రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్, సూక్ష్మ రుణ వితరణ కంపెనీ ఫ్యూజర్ మైక్రో ఫైనాన్స్, రిటైల్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వయిజరీ సర్వీసెస్, మార్కెట్ ఇంటిలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ట్రాక్సన్ టెక్నాలజీస్, రియల్టీ డెవలపర్ పురాణిక్ బిల్డర్స్లు ప్రతిపాదించిన ఆఫర్లకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.