Jaahnavi Kandula | న్యూఢిల్లీ, జనవరి 7: 2023 జనవరిలో అమెరికాలోని సియాటెల్‌లో భారత విద్యార్థిని జాహ్నవి కందులను తన పెట్రోలింగ్ వాహనంతో ఢీ కొట్టిన పోలీస్ అధికారిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ రోజు కెవిన్ దవే ఓ డ్రగ్ బానిసను పట్టుకోవడానికి గంటకు 119 కి.మీ వేగంతో తన వాహనంలో వెళ్లారు. ఆ సమయంలో ఆయన వాహనం ఢీ కొనడం వల్ల రోడ్డు దాటుతున్న జాహ్నవి కందుల 100 మీటర్ల దూరం ఎగిరి పడి మృతి చెందారు.
కెవిన్ ఉద్దేశపూర్వకంగా జాహ్నవిని ఢీకొట్టకపోయినా.. అత్యంత వేగం తో నిర్లక్ష్యంగా వాహనం నడపడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగాలని భారత్ పట్టుబడటంతో కింగ్ కౌంటీ విచారణ చేసింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు కెవిన్‌కు గతంలో 5 వేల డాలర్ల జరిమానా విధించింది.