ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి కరోనా. దీనికి టీకా కోసం యావత్ ప్రపంచమే ఎదురుచూసింది. చివరకు కొన్ని దేశాలు టీకాను కనిపెట్టాయి. చాలామంది ప్రాణాలను కాపాడాయి. అందుకే ఇప్పుడు టీకా అనే మాట వింటేనే కరోనాకే అని అంతా అనుకుంటున్నారు. అయితే, చాలా రోగాలకు ఇప్పటివరకూ వ్యాక్సిన్లు లేవు. అందులో మూత్రాశయ ఇన్ఫెక్షన్ ఒకటి. ఈ సమస్య ఉన్నవారికి టెక్సాస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుడ్న్యూస్ చెప్పారు.