హైదరాబాద్ : మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జూన్ 6న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.
8 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్లకోసం దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ 5న పరీక్ష ఉంటుందని వెల్లడించింది.
6వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
8 నుంచి 10వ తరగతి విద్యార్థులు ఏప్రిల్ 20 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.