హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ నెల 9న నిర్వహించిన గ్రూప్-1 ప్రాథమిక పరీక్షకు సంబంధించిన స్కాన్ చేసిన, డిజిటలైజ్డ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను వెబ్సైట్లోని అభ్యర్థుల లాగిన్లో అందుబాటులో ఉంచామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ శనివారం ప్రకటించారు. ప్రాథమిక కీ, మాస్టర్ ప్రశ్నపత్రం ఇప్పటికే అభ్యర్థుల లాగిన్లో పెట్టామని తెలిపారు. అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 17 వరకు గడువు ఉందని పేర్కొన్నారు.