Scam 1992 Director | సంచలన వెబ్ సిరీస్ ‘స్కామ్ 1992’ దర్శకుడు హన్సల్ మెహతా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం గాంధీ (Gandhi). మహాత్మా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రాబోతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ గాంధీ జయంతి సందర్భంగా ఫస్ట్ లుక్‌తో పాటు బిహైండ్ ది సీన్స్ చిత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు హన్సల్ మెహతా సోషల్ మీడియాలో గాంధీజీ గురించి భావోద్వేగపు పోస్ట్ షేర్ చేశారు. తాను ఎక్కడికి వెళ్తున్నానో కూడా సరిగ్గా తెలియని ఒక సాధారణ యువకుడు అయిన మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ అనుకోకుండా మహాన్నతమైన స్థాయికి చేరుకున్నారని ఆయన పేర్కొన్నారు. నేడు, గతంలో ఎన్నడూ లేనంతగా ఆయన ప్రయాణాన్ని అర్థం చేసుకుందాం మరియు ఆయన ఎంచుకున్న అహింసా మార్గాన్ని కొనియాడుదాం అని పిలుపునిచ్చారు.
మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ జీవిత కాలం అక్టోబర్ 2, 1869 నుంచి జనవరి 30, 1948 వరకు సాగింది. రామచంద్ర గుహ రాసిన పుస్తకాల ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో ‘స్కామ్ 1992’తో గుర్తింపు పొందిన ప్రతీక్ గాంధీ మహాత్మా గాంధీ పాత్రలో నటిస్తున్నారు.
View this post on Instagram