
న్యూఢిల్లీ: తాను దేశంలోనే ఉన్నానని, దేశం విడిచి పరారు కాలేదని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ సుప్రీంకోర్టుకు తెలిపారు. దాంతో బలవంతపు వసూళ్ల కేసులో ఆయనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. పరంబీర్ 48 గంటల్లోపు సీబీఐ ముందు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన లాయర్ తెలిపారు. పరంబీర్ ఎక్కడున్నారో చెబితే గానీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని కోర్టు గతంలో చెప్పడం తెలిసిందే.