‘మారటోరియం’ వడ్డీ మాఫీ..రూ.7500 కోట్ల భారం!

న్యూఢిల్లీ: కరోనా వేళ వివిధ రంగాల సంస్థలు, వ్యక్తుల రుణాలపై విధించిన ఆరు నెలల మారటోరియం కాలంలో వడ్డీ వసూలు చేయరాదని బ్యాంకర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సుదీర్ఘకాలం రుణ వసూళ్లపై మారటోరియం విధించాలన్న పిటిషన్లను ఇంతకుముందే విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు చెప్పింది.

మారటోరియంతో వడ్డీ మాఫీ చేయాల్సిందే
మారటోరియం కాలంలో రుణాల వడ్డీ వసూళ్లు చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ.7500 కోట్ల నుంచి రూ. 14వేల కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే, సకాలంలో రుణాలు తీసుకున్న వారిని మొండి బకాయిలుగా ప్రకటించవద్దన్నఆదేశాలను ఉపసంహరించుకున్నది. కరోనా రిలీఫ్ చర్యల్లో భాగంగా కేంద్రం రుణ వాయిదాల వసూళ్లపై మారటోరియం విధించినందున ఆయా రుణాలపై వడ్డీ మాఫీ అవుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

గతేడాది అక్టోబర్ రూ.6500 కోట్లు చెల్లించిన కేంద్రం
ఇప్పటి వరకు రుణ గ్రహీతల నుంచి మారటోరియం కాలంలో వసూలు చేసిన వడ్డీ మొత్తం తిరిగి చెల్లించడం గానీ, వారి రుణం చెల్లింపుల్లో సర్దుబాటు గానీ చేయాలని సూచించింది. ఇదిలా ఉంటే, రూ.2 కోట్ల లోపు చిన్న రుణాలపై వడ్డీని రూ.6,500 కోట్లు కేంద్రం గతేడాది అక్టోబర్‌లో రద్దు చేసింది. పూర్తిగా వడ్డీ వసూళ్లు మాఫీ చేస్తే డిపాజిటర్లు, బ్యాంకులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.

అదనంగా సర్కార్‌కు రూ. 7500 కోట్ల భారం
రుణాలపై మారటోరియం కాలంలో వడ్డీ వసూళ్లు మాఫీ చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల కేంద్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.7500 కోట్ల అదనపు భారం పడుతుందని ఇక్రా రేటింగ్స్ అంచనా వేసింది. ఇక్రా ఉపాధ్యక్షుడు (ఫైనాన్సియల్ సెక్టార్ రేటింగ్స్) అనిల్ గుప్తా స్పందిస్తూ.. ‘ఆరు నెలల మారటోరియం కాలంలో కాంపౌండ్ ఇంటరెస్ట్ మాఫీ చేస్తే అన్ని బ్యాంకులపై రూ.13,500-14,000 కోట్ల భారం పడుతుంది. ఇప్పటికే రూ.2 కోట్ల లోపు రుణాలకు సంబంధించి కేంద్రం రిలీఫ్‌నిచ్చింది. కనుక అదనంగా రూ.7000-7500 కోట్ల వడ్డీ మాఫీ కల్పించాల్సి ఉంది’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఫేస్బుక్ కొత్త రిస్ట్‌బ్యాండ్.. మెదడుతో కంప్యూటర్ల నియంత్రణ
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?
భారీగా తగ్గిన చమురు ధరలు.. పెట్రోల్ రేట్లు తగ్గుతాయా?
ట్యాక్స్ సేవింగ్స్ చేయాలా..? ఈ టిప్స్ పాటించండి!
కరోనా ఎఫెక్ట్..స్పీడ్ పెంచిన ఆచార్య టీం…!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

