ముంబై, ఆగస్టు 4: దేశంలోని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్బీ)లలో అతిపెద్దదైన ఏయూ ఎస్ఎఫ్బీతో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ జట్టు కట్టింది. వ్యూహాత్మక కార్పొరేట్ ఏజెన్సీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నది. ఇందులోభాగంగా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌కు చెందిన ప్రొటెక్షన్, సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, చైల్డ్, మనీ బ్యాక్, రిటైర్మెంట్ తదితర పాలసీలను ఏయూ ఎస్ఎఫ్బీ తమ కస్టమర్లకు అందించనున్నది. దేశవ్యాప్తంగా 21 రాష్ర్టాల్లో 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏయూ ఎస్‌ఎఫ్‌బీకి 2,505కుపైగా బ్రాంచీలున్నాయి. కాగా, 2047కల్లా దేశంలోని అందరికీ బీమా సదుపాయం ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగానే కలిసి ముందుకెళ్తున్నట్టు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ సందర్భంగా తెలియజేసింది.