న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఎస్బీఐ బల్క్ డిపాజిట్దారులకు షాకిచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 15 నుంచే అమల్లోకి వచ్చిన రూ.3 కోట్ల లోపు బల్క్ డిపాజిట్లపై తగ్గింపు వర్తించనున్నదని పేర్కొంది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఏడు రోజుల నుంచి 179 రోజుల లోపు బల్క్ డిపాజిట్లపై వడ్డీరేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన బ్యాంక్..180 రోజుల నుంచి 210 రోజుల లోపు డిపాజిట్లపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. వీటితోపాటు సీనియర్ సిటిజన్లకు చెల్లించే వడ్డీరేట్లను కూడా 25 బేసిస్ పాయింట్ల వరకు కోత విధించింది. 7-179 రోజుల్లోపు డిపాజిట్ల వడ్డీరేటును 25 బేసిస్ పాయింట్లు, 180 నుంచి 210 రోజుల్లోపు డిపాజిట్లపై 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది.