తామర పువ్వులే సిగసిరులు!
తలలో గులాబీలు, మల్లెలు తురుముకోవడం తరాల నుంచీ తరగని సోకే! కానీ సరస్సులో విరిసి కోవెలలో మెరిసే తామరలు కూడా సొగసరికి సిగసిరిని అద్దుతున్నాయిప్పుడు. అవును ఈ సీజన్ హెయిర్ ైస్టెలింగ్లో లోటస్ల సందడి బాగా కనిపిస్తున్నది.
తలలో గులాబీలు, మల్లెలు తురుముకోవడం తరాల నుంచీ తరగని సోకే! కానీ సరస్సులో విరిసి కోవెలలో మెరిసే తామరలు కూడా సొగసరికి సిగసిరిని అద్దుతున్నాయిప్పుడు. అవును ఈ సీజన్ హెయిర్ ైస్టెలింగ్లో లోటస్ల సందడి బాగా కనిపిస్తున్నది. జడ వేసుకున్నామా, ముడి పెట్టుకున్నామా, విరబోసుకున్నామా అన్నదాంతో సంబంధం లేకుండా అన్ని రకాల హెయిర్ ైస్టెల్స్కీ సరిపోయేలా తామర మొగ్గల్ని తలలో తురుముతున్నారిప్పుడు బ్యూటీషియన్లు.
చూడగానే కొత్తగా కనిపించడం, అటు అందానికీ ఏ మాత్రం తీసిపోకుండా ఉండటంతో ఆడవాళ్లనూ బాగానే ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు పెండ్లికూతుళ్ల పూల జడల్లోనూ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. హెయిర్ ైస్టెలింగ్ ప్రత్యేకంగా చేసే వారు లేనప్పటికీ, మనకు మనమే అలంకరించుకునేలా లోటస్ హెయిర్ క్లిప్‌లు రెడీమేడ్‌గానూ కూడా దొరుకుతున్నాయి. కాబట్టి ఇక ముందు తరుణుల కొప్పుల్లో తామరలూ తళుకులీననున్నాయి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- beauty
- Hairstyle
- Lotus
- Lotus buds
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

