హైదరాబాద్, ఆగస్టు 19: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ తెలంగాణలో భారీ వృద్ధిని నమోదు చేసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 60.7 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, అలాగే 6.56 లక్షల మందికి బీమా సేవలు అందిస్తున్నట్టు కంపెనీ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమీష్ బంకర్ తెలిపారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి కంపెనీ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ.11,708 కోట్లుగా ఉండగా, సమ్ అస్యూర్డ్ రూ.1,52,016 కోట్లుగా ఉన్నట్టు తెలిపారు. కస్టమర్లకు రూ.4 వేల కోట్లకు పైగా ఆర్థిక ప్రయోజనాలు కల్పించినట్టు చెప్పారు.