నరేష్ అగస్త్య, సంజన సారథి జంటగా నటిస్తున్న చిత్రం ‘సరసాలు చాలు’. సందీప్ చేగూరి దర్శకుడు. బి. చంద్రకాంత్‌రెడ్డి నిర్మాత. బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మొదలైంది. ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తనయుడు సాయికిరణ్ యాదవ్ చిత్రబృందానికి స్క్రిప్ట్‌ను అందచేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘అసభ్యత, అశ్లీలతకు తావులేని క్లీన్ ఎంటర్టైనర్ ఇది. ప్రారంభం నుంచి ముగింపు వరకు నవ్విస్తుంది. అన్ని వయసుల వారికి కనెక్ట్ అయ్యే కథతో తెరకెక్కిస్తున్నాం’ అన్నారు. మూడు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తిచేస్తామని నిర్మాత పేర్కొన్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా నవ్యానుభూతిని పంచే చిత్రమిదని నరేష్ అగస్త్య చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: భరత్.