మిస్టర్ మల్లేశం, బలగం చిత్రాలతో కథానాయకుడిగా అలరించిన ప్రియదర్శి నటిస్తున్న తాజా చిత్రానికి ‘సారంగపాణి’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. శ్రీదేవి మూవీస్ పతాకపంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. కొంత విరామం తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వలో ఈ చిత్రం రాబోతుంది. సినిమా కథాంశం గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘ నమ్మకం, మూడనమ్మకం నేపథ్యంఓ కొనసాగే పూర్తి వినోదాత్మక చిత్రమిది.
నమ్మకం మనిషికి బలాన్ని ఇస్తే.. మూడ నమ్మకం బుద్ది మంతుడిని కూడా బలహీన పరుస్తుంది. తన నమ్మకం, తను ఇష్టపడిన అమ్మాయి ప్రేమ మధ్య నవ్వులపాలైన ఓ మధ్యతరగతి మంచి అబ్బాయి కథ ఇది. ప్రేమ, నమ్మకం మధ్య కొట్టుమిట్టాడుతూ రెండిటికి చెడ్ద రేవడపోయాడా? లేదా బయటపడ్డాడా అనే అంశాన్ని ఆసక్తికరంగా ఈ కథలో చూపిస్తున్నాం. హీరో పాత్రలోనే వినోదం పండిస్తూ వుండే ఈ కథలో సారంగపాణిగా ప్రియదర్శి నటన ఆకట్టుకునే విధంగా వుంటుంది.
కుటుంబ సమేతంగా చూసే ఆరోగ్యకరమైన కామెడీతో రూపొందుతున్న సినిమా ఇది’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘మన ఫ్యూచర్ మన గీతాల్లో వుంటుందా? లేదా మనం చేసే పనుల్లో వుంటుందా అనే ప్రశ్నకు పర్ఫెక్ట్ జవాబుగా ఈ సినిమా వుంటుంది. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు పూర్తి వినోదాత్మకంగా దర్శకుడు జంధ్యాల సినిమాను గుర్తు చేస్తుంది. ప్రారంభం నుంచి ముగింపు వరకు నవ్వించే ఓ పూర్తిస్థాయి జంధ్యాల గారి తరహా వినోదాత్మక సినిమా ఇది. . 90 శాతం చిత్రీకరణ పూర్తి అయ్యింది. హైదరాబాద్, రామోజీ ఫిల్మ్ సిటీ, విశాఖలో ఇప్పటి వరకు నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేశాం.
ఆగస్టు 24 నుండి సెప్టెంబరు 5 వరకి రెండు పాటలు, మిగితా సన్నివేశాలు చిత్రీకరణతో సినిమాని పూర్తి చేస్తున్నాం’ అన్నారు. రూపకడువాయర్ అనే తెలుగమ్మాయి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌సాగర్ సంగీతం అందిస్తుండగా, పీజీ విందా కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. త్వరలోనే చిత్రం విడుదల తేదిని ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు.