ఇస్లామాబాద్ : పాక్‌కు చెందిన 23 సంవత్సరాల ట్రాన్స్‌జెండర్ సారా గిల్ రికార్డు సృష్టించింది. ఆ దేశంలో తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్ నిలిచింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలి ట్రాన్స్‌జెండర్ డాక్టర్‌గా నిలువడం గర్వంగా ఉందని తెలిపింది. ఎన్జీవో సహాయంతో టాన్స్జెండర్ల కోసం పని చేస్తూనే ఉంటానని చెప్పింది. ‘జీవితంలో కష్టాలు వస్తాయి. మీకు అభిరుచి ఉంటే.. మీ అడుగులను ఎవరూ ఆపలేరు. మీరు ఖచ్చితంగా విజయం వైపు పయణిస్తారు’ పేర్కొంది.
సారా గిల్ కరాచీలోని జిల్లా మెడికల్ అండ్ డెంటల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణురాలైంది. ప్రస్తుతం ఆమె పాక్‌లో ట్రాన్స్జెండర్ల కోసం పని చేస్తున్న ఎన్జీవోతోనూ సంబంధాలున్నాయి. ఈ సందర్భంగా సమాజం ఒత్తిడితో పాక్‌లోని తల్లిదండ్రులు లింగమార్పిడి పిల్లలను ఇండ్ల నుంచి ఎలా వెళ్లగొడుతారో చెప్పిన ఆమె.. వాటిని ఆపాలని సమాజానికి విజ్ఞప్తి చేసింది.
ఇటీవలి సంవత్సరాలలో పాక్‌లో లింగమార్పిడి జనాభాకు సాధికారత కల్పించేందుకు అక్కడి చర్యలు చేపట్టింది. లింగమార్పిడి పౌరులుగా వారిని నమోదు చేస్తున్నారు. హక్కులను పరిరక్షించడానికి, వివక్షను రూపుమాపేందుకు 2018లో ప్రత్యేక చట్టం చేసింది. ముల్తాన్‌లో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా పాఠశాలను సైతం నెలకొల్పింది. గతేడాది జూలైలో ఈ పాఠశాల ప్రారంభం కాగా.. అందులో చాలా మంది విద్యనభ్యసించేందుకు చేరారు. ఆ పాఠశాలలో నర్సరీ నుంచి సెకండరీ క్లాస్ వరకు విద్యాబోధనకు ఏర్పాట్లు చేశారు.