Sankara Nethralaya | శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మెట్రో ప్రాంతంలో నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రమణ రెడ్డి మద్దికుంట, CapEx సభ్యుడు తిరుమల రెడ్డి నాయకత్వంలో పేదల కంటి చికిత్స కోసం దాతల నుంచి 1.5లక్షల అమెరికన్ డాలర్ల నిధులు వచ్చాయి.
గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన Echoes of Compassion: Where Art Meets Heart థీమ్‌తో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రీయ, సాంప్రదాయ నృత్య కళలతో సేవాభావాన్ని మేళవిస్తూ నిర్వహించిన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక బృంద సభ్యురాలు లక్ష్మీ బాబు సమన్వయంతో నృత్య ప్రదర్శనలు అత్యంత క్రమబద్ధంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకకు గౌరవ అతిథిగా ఎస్వీ ఆచార్య హాజరై తమ ప్రోత్సాహకర సందేశంతో కార్యక్రమానికి మరింత గౌరవాన్ని చేకూర్చారు. అలాగే 11 మంది MESU స్పాన్సర్ల మద్దతు ఈ కార్యక్రమ విజయానికి కీలకమైంది.

Sankara Nethralaya2
ఈ కార్యక్రమానికి సెల్వ & ప్రతిభ జయరామన్, భువనేశ్ బూజాల, భానుమతి రామకృష్ణ, శ్రవణ్ పడూరు, కృష్ణకాంత్ కుచ్చలకంటి, ప్రవీణ్ పాల్‌రెడ్డి, రఘు పాల్‌రెడ్డి, వెంకట్ దోమ, తిరుమల మునుకుంట్ల, రఘు జువ్వాది ఆర్థిక, కార్యనిర్వహణ సహకారం అందించారు. అలాగే SNUSA నేషనల్, వాషింగ్టన్ డీసీ మెట్రో చాప్టర్ సభ్యులు విశేషంగా సహకరించారు. ముఖ్యంగా నీలిమ గడ్డమనుగు, కృష్ణ రాజ్ భట్, సౌమ్య నారాయణన్, డీసీ చాప్టర్ నాయకులు బాలాజీ రాధాకృష్ణన్, హరిత రెడ్డి, అర్జున్ కామిశెట్టి, దిలీరాజ్ చాంతివేలు, రూపేష్ చిన్నకంపల్లి, కార్తీక్ గౌడ్ సహకారం అందించారు.

Sankara Nethralaya1
శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి నాయకత్వం మరియు బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సభ్యుల మార్గదర్శకత్వం ఈ విజయానికి బలమైన ఆధారంగా నిలిచాయి. ట్రెజరర్ మూర్తి రేకపల్లి లాజిస్టిక్స్ నిర్వహణలో విశేష కృషి చేయగా, మీడియా సహకారం అందించిన గిరి కోటగిరి సేవలను నిర్వాహకులు అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువ వాలంటీర్లు, మీడియా, ఫోటోగ్రఫీ బృంద సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Sankara Nethralaya3

Sankara Nethralaya4