Sankara Nethralaya | డెట్రాయిట్ చాప్టర్ నిర్వహించిన శంకర నేత్రాలయ ఫండ్ రైజింగ్ సంగీత కార్యక్రమం నవంబర్ 16వ తేదీన అద్భుతంగా, ఎంతో స్ఫూర్తిదాయకంగా జరిగింది. రమణ ముదిగంటి, ప్రతిమ కొడాలి గారి నాయకత్వంలో ఏర్పాట్లు చేసిన బృందసభ్యుల (త్రిపుర సుందరి భాగవతుల, వెంకట్ గోటూర్, విజయ్ పెరుమళ్ళ మరియు రవి కవుతరపు) సేవాస్ఫూర్తి స్థానిక సమాజాన్ని ఒకచోట చేర్చింది. ఈ కార్యక్రమానికి సుమారు 400 మంది హాజరై, ప్రపంచ స్థాయి, అందుబాటు ధరలో నేత్ర సేవలను అందించడం, నివారించగల అంధత్వాన్ని తొలగించడం అనే శంకర నేత్రాలయ లక్ష్యానికి మద్దతు తెలిపారు.
ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా భారత దేశం నుంచి వచ్చిన ప్రముఖ గాయకులతో సాయంత్రం నిర్వహించిన సంగీత కచేరీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వైష్ణవి నన్నూర్, ఐశ్వర్య నన్నూర్ పాడిన ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం పార్థు నేమాని, మల్లికార్జున్, అంజనా సౌమ్య, సుమంగళి తమ పాటలతో వేదికను ఉత్సాహభరితంగా మార్చారు. అలాగే
స్థానిక ప్రతిభావంతులైన కళాకారులు అందించిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గురు శ్రీమతి సంధ్య ఆత్మకూరి నాట్య ధర్మి శిష్యులు, గురు శ్రీమతి కల్యాణి మంత్రపగడ స్వరలాపన శిష్యులు, గురు శ్రీమతి త్రిపుర సుందరి భాగవతుల నృత్యాలయ శిష్యులు అందించిన అందమైన నృత్యాలు కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక మాధుర్యాన్ని జోడించాయి.

కాగా, ముఖ్య అతిథి డా. రవి వాలియాను డెట్రాయిట్ చాప్టర్ బృందసభ్యులు శాలువా, పుష్పగుచ్ఛం, మెమొంటోతో సత్కరించి, ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా రెండు MESU కాంప్ ల నిర్వహణ కోసం 25వేల అమెరికన్ డాలర్లను రవి వాలియా విరాళంగా అందజేశారు. ఈ డబ్బుతో దాదాపు 500 మందికి కంటి శస్త్రచికిత్సలు చేయించవచ్చు. రవి వాలియా స్ఫూర్తితో మరికొందరు కూడా విరాళాలను అందజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి SNUSA అధ్యక్షులు డా. బాలా ఇందుర్తి మార్గదర్శకత్వం, అలాగే SNUSA బృందంలోని మూర్తి రేకపల్లి, త్యాగరాజన్ , డా.రెడ్డి ఊరిమిండి, వంశీ ఏరువారం, రత్నకుమార్ కవుటూరు, శ్యామ్ అప్పలీ మద్దతు ఎంతో కీలకంగా నిలిచింది.
డెట్రాయిట్ చాప్టర్ బృందం చేసిన శ్రద్ధతో కూడిన సమన్వయం, SNUSA నాయకత్వం అందించిన మద్దతు, అలాగే ప్రేక్షకుల ఉత్సాహం కలిసి ఈ ఫండ్ రైజర్‌ను విజయవంతం చేశాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం అసాధారణ కళా ప్రతిభను మాత్రమే కాదు, “Vision for All” అనే శంకర నేత్రాలయ లక్ష్యానికి సమాజం చూపుతున్న అంకితభావాన్ని కూడా మరింత బలపరిచింది.