మనోహరాబాద్, అక్టోబర్ 27: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శివ్వంపేట మండలం సికింద్లాపూర్, పెద్దగొట్టిముక్ల, గోమా రం, శివ్వంపేట, మనోహరాబాద్ మండలం పోతారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించి మద్ద తు ధర పొందాలని సూచించారు.
కుల వృత్తులకు జీవం…
కుల వృత్తులకు జీవం పోసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శివ్వంపేట మండలం గోమారం చెరువులో ప్రభుత్వం ఉచితంగా అందజేసిన చేపపిల్లలను వదిలారు. మనోహరాబాద్ మండలం పోతారంలో రూ. 2.70 లక్షలు సర్పంచ్ మాదవరెడ్డి, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఐటీసీ స్వచ్ఛంద సంస్థ, పంచాయతీ సంయుక్తంగా రూ. 18 లక్షలతో పాఠశాలను పునరుద్ధరించడంతో వారిని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో మం డల అధ్యక్షుడు రాజారమణగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్, ఎంపీటీసీ శ్రీలతఆనంద్, సర్పంచ్‌లు లావణ్య మాధవరెడ్డి, చంద్రకళ, సుధాకర్‌రెడ్డి, మాదవరెడ్డి, అర్జున్, వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్, ఉప సర్పంచ్ వీరేశ్, నాయకుడు ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
అన్నదాత అభ్యున్నతికే కొనుగోలు కేంద్రాలు
నిజాంపేట, అక్టోబర్ 27: అన్నదాత అభ్యున్నతి కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎంపీపీ సిద్ధిరాములు అన్నారు. మండలంలోని నంది గామలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మా ట్లాడా రు. దళారుల చేతుల్లో రైతులు మోసపోవద్దనే ప్ర భు త్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రీతి, ఎంపీటీసీ సురేశ్, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్ సంపత్, ఏఈవో శ్రేయ, సీసీ మల్లేశం, ఉపసర్పంచ్ రాజం, పంచాయతీ కార్యదర్శి ఆరిఫ్ హుస్సేన్, వార్డు సభ్యులు, గ్రామస్తులు సంగుస్వామి, బాలయ్య, శ్రీనివాస్‌గౌడ్, రైతులు, కార్మి కులు ఉన్నారు.
నేడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
కొల్చారం, అక్టోబర్ 27: కొల్చారం మండలంలో గురువారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీశంకర్ తెలిపారు. అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలని ఆయన కోరారు.