Sandeep Reddy Vanga | రామ్ గోపాల్ వర్మ – నాగార్జున కాంబినేషన్లో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రం శివ. ఈ సినిమాను మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. నవంబర్ 14న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో శివ సినిమా రోజులను గుర్తుచేసుకుంటూ పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా శివ రోజులను గుర్తు చేసుకోగా.. అన్నపూర్ఱ స్టూడియోస్ ఈ వీడియోను వదిలింది. ఈ సినిమా ప్రభావం తనపై చాలా ఉందని తెలిపాడు సందీప్. శివ సినిమాను ఇప్పటీకి మర్చిపోలేనని తెలిపాడు. నవంబర్ 14న ఈ సినిమా రీ రిలీజ్ కాబోతుంది. మరోసారి ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు.
b