హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాల రద్దు కోరుతూ ఈనెల 12న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు తెలంగాణ ఇసుక లారీ ల యజమానుల సంఘం మద్దతు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం సంఘం నాయకులు ఆటోనగర్‌లోని ఇసుక లారీల అడ్డాలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ.. సమ్మెను విజయవంతం చేసేందుకు తమవంతు కృషి చేస్తామని తెలిపారు. కార్మికులు, రవాణా రంగ వ్యతిరేక విధానాలను కేంద్రం వెంటనే ఉపసంహరిం-చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌యాదవ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.