దేశవ్యాప్త సమ్మెకు ఇసుక లారీల యజమానుల సంఘం మద్దతు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాల రద్దు కోరుతూ ఈనెల 12న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు తెలంగాణ ఇసుక లారీ ల యజమానుల సంఘం మద్దతు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం సంఘం నాయకులు ఆటోనగర్‌లోని ఇసుక లారీల అడ్డాలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ.. సమ్మెను విజయవంతం చేసేందుకు తమవంతు కృషి చేస్తామని తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాల రద్దు కోరుతూ ఈనెల 12న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు తెలంగాణ ఇసుక లారీ ల యజమానుల సంఘం మద్దతు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం సంఘం నాయకులు ఆటోనగర్‌లోని ఇసుక లారీల అడ్డాలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ.. సమ్మెను విజయవంతం చేసేందుకు తమవంతు కృషి చేస్తామని తెలిపారు. కార్మికులు, రవాణా రంగ వ్యతిరేక విధానాలను కేంద్రం వెంటనే ఉపసంహరిం-చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌యాదవ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

