
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇసుక విక్రయాలు పుంజుకొంటున్నాయి. ఆగస్టు నుంచి ఈ ధోరణి కనిపిస్తున్నది. కరోనా భయాలు తొలగిపోవడం, వానకాలం సీజన్ ముగియడం, నిర్మాణరంగం పుంజుకోవడమే ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇసుక విక్రయాల ద్వారా రూ.851 కోట్ల మేర ఆదాయం రాబట్టాలనేది ప్రభుత్వ లక్ష్యం. అక్టోబర్ చివరి నాటికే రూ.452.39 కోట్ల ఆదాయం లభించడం విశేషం. గతేడాది ఇదే కాలానికి రూ.350.28 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఈ ఏడాది ఇసుక విక్రయాల్లో భారీ స్థాయిలో వృద్ధి నమోదైనట్టు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.