మిట్టకంటి రామ్, విజయ్‌శంకర్, అక్షితా సోనవానే ప్రధాన పాత్రల్లో జాన్ జిక్కి దర్శకత్వం వహించిన ‘2020 గోల్మాల్’, అనిల్‌కుమార్, వినోద్ నాగులపాటి, ఉషాంజలి ప్రధాన పాత్రల్లో నటించగా గంగాధర వైకే అద్వైత్ దర్శకత్వం వహించిన ‘సురభి 70ఎం.ఎం (హిట్టుబొమ్మ) సినిమాల ప్రీరిలీజ్ వేడుకలు శనివారం హైదరాబాద్‌లో ఒకే వేదికమీద జరిగాయి. ఈ సందర్భంగా ‘2020 గోల్మాల్’ దర్శకుడు జాన్జిక్కి మాట్లాడుతూ..ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతిని కలిగించే చిత్రమిదని చెప్పారు. ‘సురభి 70ఎం.ఎం’ దర్శకుడు గంగాధర వైకే అద్వైత మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో సాగే చక్కటి వినోదాత్మక చిత్రమిది. ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది’ అన్నారు.